ఖతార్‌ నుంచి ఇండియాకి మృతదేహం తరలింపు

- December 10, 2015 , by Maagulf
ఖతార్‌ నుంచి ఇండియాకి మృతదేహం తరలింపు
 
 


ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా కుంగిపోయి గుండెపోటుతో మరణించిన ఓ వ్యక్తిని 40 రోజుల తర్వాత ఇండియాకి తరలించారు. కాంట్రాక్టర్‌గా పనిచేసి, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆ వ్యక్తి స్థానిక బ్యాంకు నుంచి లోన్‌ తీసుకుని తిరిగి చెల్లించలేకపోయాడు. అల్‌ ముర్రాలోని ఇంట్లో హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయాడు ఆ వ్యక్తి. అతని మృతదేహం 40 రోజులుగా హమాద్‌ జనరల్‌ హాస్పిటల్‌ మార్చురీలో 40 రోజులుగా భద్రపరచబడింది. మృతుడిని కేరళలోని తిరువనంతపురం జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. ఇండియన్‌ ఎంబసీతోపాటు, ఖతార్‌లోని కొందరు మానవీయ కోణంలో మృతదేహాన్ని బాధిత కుటుంబానికి అప్పగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సహకరించిన ఇండియన్‌ ఎంబసీతోపాటు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు మానవ హక్కుల ప్రతినిథులు కెఎం అలీ, అబ్దుల్‌ సలాం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com