సక్సెస్ సెలెబ్రేట్ చేసుకున్న మహానటి, అభిమన్యుడు
- June 24, 2018
విశాల్, కీర్తి సురేష్ ఇప్పుడు ఇవే పేర్లు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కు మారుపేరుగా విపినిపిస్తున్నాయి. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్ కీర్తిసురేష్. ఇటీవల ఆమె ప్రధానపాత్రలో తెరకెక్కిన 'మహానటి' సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఇటు తెలుగు అటు తమిళంలోనూ మంచి వసూళ్లను రాబట్టింది. ఇక 'మహానటి' కాస్త లేట్ గా రిలీజ్ విశాల్ 'అభిమన్యుడు' కూడా భారీ సక్సెస్ అయింది. తెలుగు, తమిళంలో కలిపి ఈ చిత్రం దాదాపు 80 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అభిమన్యుడు సక్సెస్ తో విశాల్, మహానటి సక్సెస్ తో కీర్తి సురేష్ ఇలా ఎవరికీ వారు సక్సెస్ ను ఎంజాయ్ చేయకుండా ఇద్దరు కలిసి రెండు సినిమాల సక్సెస్ ను సెలెబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు 'సండై కోళి 2'(పందెంకోడి 2) లో నటిస్తున్నారు.నిన్న ఈ సినిమా షూటింగ్ ప్యాకప్ చెప్పగానే ఇంటికి వెళ్లిపోకుండా సెట్లో సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. కేక్ కట్ చేసి ఒకరికోరు తినిపించుకుని.. అనంతరం డిన్నర్ చేశారు. ఇద్దరు కలిసి త్వరలోనే ఈ ద్వయం(పందెంకోడి 2)తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







