రైతుల మధ్య ఘర్షణ.. 86 మంది మృతి
- June 25, 2018
రైతులకు, పశు వ్యాపారులకు మధ్య జరిగిన జాతి ఘర్షణల్లో 86 మంది మృతిచెందారు. సెంట్రల్ నైజీరియాలో ఈ ఘటన జరిగింది. స్థానిక జాతులైన బెరోమ్ రైతులు, ఫౌలానీ పశు వ్యాపారుల మధ్య గురువారం భారీ ఘర్షణ జరిగింది. ఆ రోజు సుమారు అయిదు మంది చనిపోయారు. ఆ తర్వాత మళ్లీ శనివారం హింస చోటుచేసుకుంది. ఇక్కడున్న భూమి కోసం కొన్ని దశాబ్ధాలుగా స్థానిక తెగల మధ్య ఘర్షణలు జరగుతూనే ఉన్నాయి. తాజాగా గ్రామస్థులు ఘర్షణకు దిగిన ఘటనలో 86 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసు కమీషన్ ఉండి అడే తెలిపారు. 50 ఇండ్లు, 15 మోటర్‌సైకిళ్లు, రెండు వాహనాలను తగలబెట్టారు. హింస తర్వాత అక్కడ కర్ఫ్యూ విధించారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







