ఛలో కెనడా...
- June 25, 2018
కెనడా:విద్యార్థి వీసాల నిబంధనలను అమెరికా కఠినతరం చేయడంతో భారతీయ విద్యార్థులు కెనడాపై దృష్టి సారించారు. కెనడాలో విద్య నభ్యసించే భారతీయ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీని కనుగుణంగా కెనడా సైతం భారతీయ విద్యార్థుల కోసం స్టూడెంట్ వీసా ప్రక్రియను సులభతరం, వేగవంతం చేస్తోంది. 45 రోజుల్లో విద్యార్థి వీసా జారీ చేసేలా కెనడా నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నెల ప్రారంభం నుంచే ఈ విధానం అమల్లోకి వచ్చింది.
స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్(ఎస్డీఎస్) కార్యక్రమం అనే ఈ విధానం కింద తమకు తగినంత ఆర్థిక వనరులు, విద్యకు అవసరమైన భాషా నైపుణ్యాలు ఉన్నట్టు రుజువు చేసుకున్న కాలేజీ విద్యార్థులకు కెనడా ప్రభుత్వం వేగంగా వీసాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకు ముందు కెనడా విద్యార్థి వీసాలు పొందాలంటే 60 రోజులు పట్టేది. ఎస్డీఎస్ లో దీనిని 45 రోజులకు తగ్గిస్తున్నట్టు కెనడా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో భారత్, చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాల విద్యార్థులు కూడా దరఖాస్తు చేసిన నెలన్నరలోగా కెనడియన్ వీసా పొందనున్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్