ప్రభాస్ తో రాధాకృష్ణ కొత్త చిత్రం
- December 11, 2015
ఇప్పటికీ బాహుబలి సినిమా పనుల్లోనే బిజీగా ఉన్న ప్రభాస్.. తన నెక్ట్స్ సినిమాల విషయంలో కూడా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. యంగ్ డైరెక్టర్లతో స్టైలిష్ ఎంటర్ టైనర్ లకు రెడీ అవుతున్నా.. ఆ సినిమాలు ఎప్పుడు పట్టాలెక్కుతాయో మాత్రం అర్ధం కావటంలేదు. ఇంకా బాహుబలి 2 షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. ఆ సినిమా షూటింగ్ పూర్తయి రిలీజ్ అయితే గాని ప్రభాస్ మరో సినిమా మొదలు పెట్టడానికి అవకాశం లేదు. ఇప్పటికే 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడు ప్రభాస్. ఈ సినిమా కోసం వేరే ప్రయత్నాలేవి చేయకుండా వెయిట్ చేస్తున్నాడు సుజిత్. అయితే తాజాగా మరో దర్శకుడి పేరు తెర మీదకు వచ్చింది. సుజిత్ ను పరిచయం చేసిన యువి క్రియేషన్స్ బ్యానర్ ద్వారానే దర్శకుడిగా పరిచయం అయిన రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు ప్రభాస్. తొలి సినిమా జిల్ తో స్టైలిష్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాధాకృష్ణ ప్రభాస్ తోనూ అదే తరహా సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. బాహుబలి 2 తరువాత ఈ ఇద్దరు దర్శకుల్లో ఎవరికి ముందుగా ఛాన్స్ ఇస్తాడో చూడాలి. అయితే దర్శకుడు ఎవరైన ఆ సినిమాను నిర్మించేది మాత్రం యువిక్రియేషన్స్ సంస్థే అన్న టాక్ వినిపిస్తోంది. ఏ సినిమా అయిన 2016లో అయితే తెర మీదకు వచ్చే అవకాశం మాత్రం కనిపించటం లేదు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







