దుబాయ్‌ టవర్‌లో అగ్ని ప్రమాదం

- June 25, 2018 , by Maagulf
దుబాయ్‌ టవర్‌లో అగ్ని ప్రమాదం

దుబాయ్‌:జుమైరా విలేజ్‌ సర్కిల్‌లోని 40 అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదం అందర్నీ షాక్‌కి గురిచేసింది. అయితే దుబాయ్‌ సివిల్‌ డిఫెన్స్‌ అత్యంత చాకచక్యంగా మంటల్ని ఆర్పివేసింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. సివిల్‌ డిఫెన్స్‌ ఆపరేషన్స్‌ రూమ్‌కి మధ్యాహ్నం 1.39 నిమిషాల సమయంలో ఘటన గురించి సమాచారం అందగా, 3.07 నిమిషాలకి మంటల్ని నియంత్రించగలిగారు. అల్‌ బర్షా, మర్సా ప్రాంతాల నుంచి వచ్చిన టీమ్‌లు కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. కూలింగ్‌ ఆపరేషన్స్‌ 3.21 గంటల వరకు జరిగాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com