'పాస్‌పోర్ట్ సేవా' యాప్‌ను ప్రారంభించిన సుష్మా స్వరాజ్
- June 26, 2018
న్యూఢిల్లీ: పాస్‌పోర్టు దరఖాస్తును సులభతరం చేసి, సత్వరమే జారీ చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త యాప్‌ను ఆవిష్కరించింది. 'పాస్‌పోర్టు సేవా దివస్'ను పురస్కరించుకుని కేంద్ర విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ ఇవాళ 'పాస్‌పోర్ట్ సేవా' యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాస్‌పోర్టు సేవా కేంద్రాల అధికారులు, విదేశాంగ మంత్రిత్వశాఖ సభ్యులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.
భారత దేశంలో ఎక్కడినుంచైనా పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునేందుకు, మొబైల్ ఫోన్ల నుంచి పాస్‌పోర్టు అప్లికేషన్లు పూర్తి చేసుకునేందుకు వీలుగా రెండు పథకాలను సుష్మా స్వరాజ్ ప్రకటించారు. దీనిని ''పాస్‌పోర్టు విప్లవంగా'' ఆమె అభివర్ణించారు. ''హజ్ యాత్ర కోసం పాస్‌పోర్టులు, వీసాలు భారత ప్రజలకు నేరుగా అనుసంధానమయ్యే రెండు విషయాలని నేను భావిస్తున్నాను'' అని ఆమె పేర్కొన్నారు. హజ్ యాత్ర మైనారిటీ వ్యవహారాల శాఖ కిందికి వస్తుండగా... పాస్‌పోర్టు జారీ బాధ్యత విదేశాంగ మంత్రిత్వ శాఖ చూసుకుంటోంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







