సముద్రంలో మునిగి 9 ఏళ్ళ బాలుడి మృతి

- June 26, 2018 , by Maagulf
సముద్రంలో మునిగి 9 ఏళ్ళ బాలుడి మృతి

రస్‌ అల్‌ ఖైమా:తొమ్మిదేళ్ళ బాలుడు, రస్‌ అల్‌ ఖైమాలోని బీచ్‌లో ఈత కొడుతూ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదవశాత్తూ నీట మునిగి బాలుడు మృతి చెందినట్లు ప్రాధమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. బాలుడ్ని జాయెద్‌ ఈద్‌ అల్‌ ముస్తాఫిగా గుర్తించారు. ఈ ఎమిరేటీ బాలుడు గ్రేడ్‌ 3 చదువుతున్నాడు. అల్‌ ఖిరాన్‌ స్కూల్‌లో బాలుడు విద్యనభ్యసిస్తున్నట్లు అధికారులు వివరించారు. స్విమ్మింగ్‌ కోసం సముద్రంలోకి వెళ్ళిన బాలుడి మృతి పట్ల సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com