హలో కిట్టీ రైలును చూశారా..

- June 26, 2018 , by Maagulf
హలో కిట్టీ రైలును చూశారా..

జపాన్:ముద్దుగా ఉండే హలో కిట్టీ బొమ్మలంటే ఎవ్వరికైనా ఇష్టమే. జపాన్‌లో ఉన్నవారికైతే మరీనూ.. ఎంతగా అంటే.. అదే పేరుతో.. అదే థీమ్‌తో ఓ బుల్లెట్‌ రైలు నడిపేంత. అవును.. 'హలో కిట్టీ' పేరుతో జపాన్‌లో ఓ బుల్లెట్‌ రైలును ప్రారంభించారు. గులాబీ రంగులో ఆకర్షణీయంగా ఉండే ఈ రైలెక్కితే.. 'కిట్టీ'తో కలసి ప్రయాణించే అనుభూతి ఖాయమని అధికారులు చెబుతున్నారు. ఓ కంపార్ట్‌మెంట్‌లోనైతే మొత్తం కిట్టీ బొమ్మలే ఉంచారు. రైలులోని కిటికీలపైన, సీట్‌ కవర్లపైన, ఫ్లోరింగ్‌పైన కిట్టీ బొమ్మలే. 1974లో యూకో షిమిజు సృష్టించిన ఈ కిట్టీ క్యారెక్టర్‌.. ఇప్పుడో అంతర్జాతీయ బ్రాండ్‌. అందుకే.. ఈ బ్రాండ్‌తో రైలును నడిపితే విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షించవచ్చన్నది జపాన్‌ రైల్వే ఆలోచన. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com