ఉమ్మడి హైకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తి..
- June 27, 2018
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్నారు. తాజా నియామకంతో దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఉమ్మడి హైకోర్టుకు రెగ్యులర్ చీఫ్ జస్టిస్ నియామకం జరిగినట్లయింది. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ రమేశ్ రంగనాథన్ వ్యవహరిస్తున్నారు. అలాగే, పాట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ అజయ్ కుమార్ త్రిపాఠీకి పదోన్నతి కల్పించి, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఈ మేరకు సుప్రీం కోర్టు కొలీజియం ఈ ఏడాది మొదట్లో చేసిన సిఫారసులకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది.
కేరళకు చెందిన జస్టిస్ రాధాకృష్ణన్.. కొల్లమ్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ న్యాయవాదులే. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లా కాలేజీ నుంచి న్యాయవాద పట్టా పుచ్చుకున్నారాయన. 1983 డిసెంబరులో న్యాయవాదిగా నమోదు చేయించుకుని తిరువనంతపురంలో ప్రాక్టీసు ప్రారంభించారు. ఆ తర్వాత ఎర్నాకుళంలోని హైకోర్టుకు మారారు. 2004 అక్టోబరు 14న ఆయన కేరళ హైకోర్టులో శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు.

తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్