పోలీసుల అదుపులో హీరో జై
- June 28, 2018
ఒకటికాదు రెండు ముచ్చటగా మూడోసారి పోలీసులకు చిక్కారు కోలీవుడ్ నటుడు జై.. 2014 లో కేకే.నగర్‌లోని కాశి థియేటర్ ప్రాంతంలో పూటుగా మద్యం సేవించి ట్రాఫిక్ పోలీస్ వాహనాన్నే ఢికొట్టిట్టిన కేసులో నాలుగు రోజుల శిక్ష అనుభవించాడు. ఆ తరువాత 2017 సెప్టెంబరు 21న మళ్ళీ మద్యం సేవించి వేగంగా కారు నడుపుతూ బ్రిడ్జ్ గొడను ఢీకొట్టాడు. ఈ కేసులో పోలీసులు అతనికి జరిమానా విధించి 6 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేశారు.. తాజాగా 'జై' మరోసారి పోలీసుల అదుపులో ఉన్నారు. మంగళవారం రాత్రి నుంగంబాక్కమ్ ప్రధానరోడ్డులో విపరీతధ్వనితో సైరన్ మోగించుకుంటూ వెళ్లడంతో ఇతర వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు 'జై' కారును వెంబడించి అడ్డుకున్నారు. ఆ సమయంలో అతను మద్యం సేవించి ఉన్నారు. 'జై' ని అదుపులోకి తీసుకుని ధ్వని కాలుష్యం వలన వచ్చే అనర్ధాల గురించి అవగాహన వీడియోలను అతనికి చూపించారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







