మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలి: ప్రిన్సెస్‌ సబీకా

- December 11, 2015 , by Maagulf
మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలి: ప్రిన్సెస్‌ సబీకా
 
 


అంతర్జాతీయ అత్యున్నత కాన్ఫరెన్స్‌ 'విమెన్‌ ఇన్‌ పబ్లిక్‌ లైఫ్‌: ఫ్రమ్‌ పాలసీస్‌ టు ఇంపాక్ట్‌' పేరుతో జరిగింది. ప్రిన్సెస్‌ సబీకా బింట్‌ ఇబ్రహీమ్‌ అల్‌ ఖలీఫా నేతృత్వంలో జరిగిన ఈ కాన్ఫరెన్స్‌ మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలని అభిప్రాయపడింది. మూడు రోజులపాటు జరిగిన ఈ కాన్ఫరెన్స్‌ని సుప్రీం కౌన్సిల్‌ ఫర్‌ విమెన్‌, ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ (ఓఇసిడి) సహకారంతో చేపట్టింది. జాతీయ స్థాయిలో మహిళలకు పురుషులతో సరిసమానంగా అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలని కాన్ఫరెన్స్‌లో వక్తలు అభిప్రాయపడ్డారు. అరబ్‌ దేశాల్లో మహిళలు, వారికి అన్ని రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పించడంపై విస్తృతమైన చర్చ జరిగింది. ప్రభుత్వ సెక్టార్లు, ప్రైవేటు సెక్టార్లూ దీనికోసం ముందుకు రావాలని వక్తలు ఆకాంక్షించారు. 2014నివేదిక ప్రకారం బహ్రెయిన్‌లో అత్యధిక శాతం మహిళలు అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో ఎక్కువగా ఉన్నత స్థానంలో తమ ఉనికిని చాటుకుంటున్నారు. పబ్లిక్‌ సెక్టార్‌లో ఎడ్మినిస్ట్రేటివ్‌ విభాగంలో సీనియర్‌ పొజిషన్‌లో సుమారు 45 శాతం మంది మహిళలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ పొజిషన్‌లో 59 శాతం ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com