అత్యాధునిక సౌకర్యాలతో మ్యూజియం ప్రారంభం
- December 11, 2015
అత్యాధునిక సౌకర్యాలతో ఒమన్‌లో నేషనల్ మ్యూజియంను ప్రారంభించనున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ అండ్ కల్చర్ నేషనల్ మ్యూజియం డైరెక్టర్ జమాల్ బిన్ హసన్ అల్ మౌస్సావి మాట్లాడుతూ, అత్యున్నతస్థాయి సౌకర్యాలతో ఈ మ్యూజియం ప్రారంభం కానున్నట్లు చెప్పారు. అంధులకు వీలుగా బ్రెయిలీ సింబల్స్ కూడా ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఒమన్‌కి చెందిన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక సాంస్కృతిక విషయాలు ఈ మ్యూజియం ద్వారా ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా మ్యూజియంను తీర్చిదిద్దారు. ఈ మ్యూజియంలో యుహెచ్‌డి సినిమా థియేటర్ని కూడా ఏర్పాటు చేశారు. ఒమన్‌లో ఇదే తొలి యుహెచ్‌డి సినిమా థియేటర్. 12 నిమిషాల ప్రెజెంటేషన్ ఈ థియేటర్లో ఉంటుంది. ఆరు వేలకు పైగా కళాఖండాలు ఈ మ్యూజియంలో పొందుపర్చబడ్డాయి. పురాతనకాలం నాటి ఆయుధాలు, షిప్‌లు, చారిత్రక నిర్మాణాలకు సంబంధించిన మోడల్స్ ఈ మ్యూజియంలో దర్శనమిస్తాయి. వచ్చే సోమవారం ఈ మ్యూజియంను ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







