ఒంటిపై దుస్తులు తీసేసి.. తనపై బ్లేడ్లతో దాడి చేశారంటూ...

- June 29, 2018 , by Maagulf
ఒంటిపై దుస్తులు తీసేసి.. తనపై బ్లేడ్లతో దాడి చేశారంటూ...

బంజారాహిల్స్‌లో ఓ యువతి కిడ్నాప్  కలకలం రేపింది. పబ్‌లో ఉన్న  యువతిపై బ్లేడ్లతో దాడి చేసి కిడ్నాప్‌ చేశారు.  ఈ  వ్యవహరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మూడురోజుల కిందట ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సమీరా అనే మహిళ   దుబాయ్‌ నుంచి  వచ్చి నగరంలో ఉంటుంది. ఈ సమయంలోనే ఆమెకు  పరిచయస్తుడైన ఫిరోజ్‌తో గొడవలు మొదలు  అయినట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో   సమీరా పబ్‌లో ఉండగా ఆమెపై ఫిరోజ్ దాడి చేసి  కిడ్నాప్‌  చేశాడు. అతని చెర నుంచి  తప్పించుకున్న  సమీరా.. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌‌లో  పిర్యాదు  చేపింది. బాత్రూమ్‌లో తననను బంధించి దారుణంగా హింసించారని  ఒంటిపై దుస్తులు తీసేసి తనపై బ్లేడ్లతో కోశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ సంఘటనపై  కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com