ఇరాన్‌ నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతులు కొనసాగుతాయి: టర్కీ

- June 29, 2018 , by Maagulf
ఇరాన్‌ నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతులు కొనసాగుతాయి: టర్కీ

ఇరాన్‌ నుండి తాము క్రూడాయిల్‌ దిగుమతులను ఇకపై కూడా కొనసాగిస్తామని టర్కీ స్పష్టం చేసింది. నవంబర్‌ 4 నుండి తాము విధించిన తాజా ఆంక్షలు అమలులోకి రానున్న నేపథ్యంలో ఇరాన్‌ నుండి క్రూడాయిల్‌ దిగుమతులను నిలిపివేయాలని అమెరికా విదేశాంగశాఖ తన మిత్రదేశాలకు సూచించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన టర్కీ ఆర్థిక మంత్రి నిహాత్‌ జెబికీ మీడియాతో మాట్లాడుతూ అమెరికా తీసుకున్న నిర్ణయాలకు తాము బద్ధులం కాలేమని స్పష్టం చేశారు. తాము ఐరాస నిర్ణయాలను గౌరవించి వాటిని అనుసరిస్తామని, వీటితో పాటు తమ జాతీయ ప్రయోజనాలకు అనువైన నిర్ణయాలను తీసుకుంటామని ఆయన వివరించారు. తమ మిత్ర దేశం ఇరాన్‌ అన్యాయమైన ఎటువంటి ఆంక్షలు ఎదుర్కోకుండా తాము దృష్టి పెడతామన్నారు. ఇరాన్‌ నుండి క్రూడాయిల్‌ దిగుమతులను నిలిపివేయాలంటూ అమెరికా చేసిన సూచనను బేఖాతరు చేస్తూ జపాన్‌, ద.కొరియా, భారత్‌ వంటి దేశాలతో పాటు ఐరోపా కూటమి కూడా తాము ఇరాన్‌ దిగుమతులను కొనసాగిస్తామని ఇప్పటికే స్పష్టం చేశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com