దుబాయ్ మెట్రో రూట్ 2020 టన్నెల్ డ్రిల్లింగ్ పూర్తి
- June 30, 2018
ఎక్స్‌పో 2020 సైట్‌ని కనెక్ట్ చేసే మెట్రో రైల్ రూట్‌కి సంబంధించి కీలకమైన ముందడుగు పడింది. రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం, ముఖ్యమైన టన్నెలింగ్ వర్క్స్ పూర్తయ్యాయి. 3.2 కిలోమీటర్ల టన్నెల్ పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాదిలో ఈ టన్నెల్ పనులు ప్రారంభమయ్యాయి. ఆర్‌టిఎ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ డైరెక్టర్ జనరల్, ఛైర్మన్ మట్టర్ అల్ తాయెర్ మాట్లాడుతూ, జెయింట్ టన్నెల్ బోరింగ్ మెషీన్ 'అల్ వుగెషా ఎక్స్‌పో 2020' ద్వారా ఈ డ్రిల్లింగ్ పనులు చేసినట్లు చెప్పారు. ఈ మెషీన్ ఎన్విరాన్‌మెంటల్ ఫ్రెండ్లీ అనీ, ఎలాంటి నెగెటివ్ ఎఫెక్ట్స్ కూడా ల్యాండ్ లేయర్స్‌పై వుండకుండా పనిచేస్తుందని వివరించారాయన. రూట్ 2020 రెడ్ లైన్ ఎక్స్‌టెన్షన్. నఖీల్ హార్బర్ మరియు టవర్ స్టేషన్ వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర ఈ లైన్ విస్తరించి వుంటుంది. 11 కిలోమీటర్ల లాంగ్ వయాడక్ట్, 4 కిలోమీటర్ల అండర్‌గ్రౌండ్ రైల్ ట్రాక్ ఇది. మొత్తం ఏడు స్టేషన్లు వుంటాయి. వీటిలో ఐదు ఎలివేటెడ్ మరియు రెండు అండర్‌గ్రౌండ్ స్టేషన్స్.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్