అలనాటి నటుడి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం

- July 02, 2018 , by Maagulf
అలనాటి నటుడి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఏలూరులో పర్యటించనున్నారు. ఉదయం పదిన్నరకు ఆయన హెలికాప్టర్‌ లో సీఆర్ఆర్ డిగ్రీ కాలేజీ మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో పెద్దపాడు మండలం వట్లూరులో ఎస్వీ రంగారావు శత జయంతి సందర్భంగా ఆయన మేనల్లుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఏర్పాటు చేసిన ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరిస్తారు.  తిరిగి ఏలూరు చేరుకొని పవర్‌పేటలో ఎన్జీవో హోం నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం పన్నెండున్నరకు జిల్లా ప్రధానాసుపత్రిలో తలసేమియా వ్యాధి నివారణ కేంద్రాన్ని ప్రారంభిస్తారు.  ఈ తర్వాత ఇండోర్‌ మైదానంలో జిల్లా సహకార బ్యాంక్ శత వసంతోత్సవంలో చంద్రబాబు పాల్గొంటారు.చంద్రబాబు పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులతో పాటు కృష్ణా, తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఏలూరుకు చేరుకున్నారు. జిల్లా ఎస్పీ రవిప్రకాశ్‌ ఆధ్వర్యంలో ఇద్దరు ఏఎస్పీలు, 15 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, నాలుగు ఏఆర్ స్పెషల్‌ ప్లాటూన్లు మొత్తం 1500 మంది పోలీసులు సీఎం బందోబస్తులో పాల్గొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com