అమెరికాలో లక్ష ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం..కారణం ఏంటంటే..
- July 03, 2018
అమెరికా ఫస్ట్.. ఈ విధానం అక్కడి వాళ్లకు ఎంత యూజ్ అవుతోందో గానీ.. మనవాళ్ల ఉద్యోగాలకు మాత్రం ఎసరు పెడుతోంది.. అమెరికాలో మన టెకీలకు బ్యాడ్ డేస్ స్టార్ట్ అయ్యాయి.. ఇప్పటికే హెచ్-1బీ వీసాలపై ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న భారతీయ టెకీలకు మరో షాక్ ఇచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమైంది.. మరో వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ విధానంతో లక్ష ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఏర్పడింది. హెచ్1-బీ వీసాపై వచ్చినవారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేయడాన్ని నిషేధించే ఆలోచనలో ఉంది ట్రంప్ ప్రభుత్వం. ఈ నిర్ణయంతో లక్ష మంది ఉద్యోగాలు ఊడిపోవడం ఖాయమని ఓ సర్వేలో వెల్లడైంది. ట్రంప్ తన నిర్ణయాన్ని అమలు చేస్తే ఎంతో మంది హెచ్-1బీ టెకీల కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని సర్వే పేర్కొంది.
టెన్నెస్సీ విశ్వవిద్యాలయానికి చెందిన క్రిస్టోఫర్ జేఎల్ కన్నింఘం, కెమ్మీ బిజినెస్ స్కూల్‌కు చెందిన పూజ.బి.విజయ్‌కుమార్ నిర్వహించిన సర్వేలో ఆందోళనకర అంశాలు వెలుగు చూశాయి. ఇప్పటికే పలువురు భారతీయులు స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వారు చెప్పారు. దిగ్గజ కంపెనీల్లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు హెచ్-1బీ భాగస్వాముల వివరాలు సేకరిస్తుండటంతో ఈ ఆందోళన మరింత పెరుగుతోంది. అమెరికాలో వీసా కష్టాలపై నాలుగేళ్ల నుంచి యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేస్తున్న కాకినాడ వాసి కుమార్ తాజాగా పోస్ట్ చేసిన తన వీడియోలో అనేక విషయాలు వెల్లడించారు.
2015కు ముందు హెచ్1బీ వీసాపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారి భాగస్వాములకు పని చేసే అవకాశం లేదు. ఆ తర్వాత హెచ్4 వీసా కలిగిన జీవిత భాగస్వాములకు అమెరికాలో చట్టబద్ధంగా పనిచేయడానికి ఒబామా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. 2015 నుంచి 2017 డిసెంబర్ వరకు లక్షా 26 వేలకు పైగా హెచ్4 ఈఏడీలను మంజూరు చేస్తే, వారిలో 93 శాతం మంది భారతీయులే ఉన్నారు. ఈఏడీ పొందిన వారిలో ఎక్కువగా కాలిఫోర్నియా, సిలికాన్ వ్యాలీ, న్యూజెర్సీ, సియాటిల్, డల్లాస్, హస్టన్, వాషింగ్టన్‌లోనే ఉంటున్నారు.
ముందు ముందు ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో చాలా మంది అమెరికా నుంచి స్వదేశం బాట పట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ట్రంప్ నిర్ణయాలను తీవ్రంగా తప్పు పడుతున్న ప్రవాస భారతీయ టెకీలు తీవ్రమైన నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. అమెరికాలో ఉండలేక ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయకుమార్ కూడా ఇక్కడకు తిరిగొచ్చేశారు.. వచ్చే ముందు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తన వీడియోలో వివరించారు. హెచ్-1బీ వీసా ఉన్నా పనికి తగ్గట్టు వేతనాలు లేవని.. అందుకే అమెరికాను వదిలేస్తున్నట్లు వీడియోలో వివరించారు. చివరకు నేటివ్ ప్లేస్ కాకినాడ చేరుకుని మరో వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలే చెబుతున్నాయి అమెరికాలో మన టెకీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో..?
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







