ముంచెత్తుతున్న భారీ వర్షాలు..జనజీవనం అస్తవ్యస్తం
- July 03, 2018
ముంబైలో వానలు మరోసారి విజృంభించాయి. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. మాతుంగ కింగ్ సర్కిల్ దగ్గర రోడ్లపై నీళ్లు మోకాలి లోతు వరకు చేరుకున్నాయి. పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల వాహనాలు నీళ్లలో నిలిచిపోయి మొరాయించాయి.
ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాలతో ముంబై నగర వాసుల జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా, శ్యాం తలావ్, హింద్ మట, ఒబేరాయ్ మాల్, సీఎస్టీ రోడ్డు, కుర్లా, మాహిమ్ జంక్షన్, నెహ్రూనగర్ బ్రిడ్జి, శాంతాక్రజ్, చెంబూర్ లింక్ రోడ్డు ప్రాంతాల్లో వరద నీరు నిలిచింది. రోడ్లపై నిలిచిన వాననీటిని తొలగించేందుకు ముంబై కార్పొరేషన్ సహాయక చర్యలు చేపట్టింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!