వాట్సాప్‌కు వార్నింగ్
- July 03, 2018
ఇటీవలి కాలంలో వాట్సాప్ మెసేజీల కారణంగా జనం ఇటీవల ఆమాయకులైన వారిని కొట్టి చంపిన ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో వాట్సాప్‌లో బాధ్యతా రహితమైన, రెచ్చగొట్టే సందేశాల వ్యాప్తిని అడ్డుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆ సంస్థను ఆదేశించింది. కేంద్ర ఎలక్ట్రానిక్ ఐటి మంత్రిత్వశాఖ వాట్సాప్ అధినేతకు తన తీవ్ర నిరసనను తెలియజేస్తూ, ఫేస్‌బుక్‌కు చెందిన ఆ సంస్థ తన బాధ్యత, జవాబుదారీతనంనుంచి తప్పించుకోజాలదని స్పష్టం చేసినట్లు ఒక అధికారిక ప్రకటన తెలిపింది. అసోం, మహారాష్ట్ర, కర్నాటక, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వాట్సాప్‌లో వచ్చిన తప్పుడు మెసేజీల కారణంగా జనం అమాయకులను కొట్టి చంపిన ఘటనలు వరసగా చోటు చేసుకున్న దృష్టా కేంద్రం వాట్సాప్‌కు ఈ హెచ్చరిక చేసింది. ఆ రాష్ట్రాల్లో జరిగిన ఘటనలు బాధాకరం, విచారకరమని మంత్రిత్వశాఖ అం టూ, అలాంటి రెచ్చగొట్టే సందేశాలను పదేపదే సర్కులేట్ చేయడం కోసం వాట్సాప్‌లాంటి ప్లాట్‌ఫామ్‌లను దుర్వినియోగం చేయడం తీవ్ర అందోళన కలిగిస్తోందని పేర్కొంది. ఇలాంటి బాధ్యతా రహితమైన, రెచ్చగొట్టే సందేశాలను, వాట్సాప్‌లాంటి వేదికల ద్వారా వాటిని వ్యాప్తి చేయడాన్ని మంత్రిత్వ శాఖ తీవ్రమైన విషయంగా పరిగణిస్తోందని, ఇలాంటి పరిణామాలపై తమ తీవ్ర అభ్యంతరాలను వాట్సాప్ యాజమాన్యానికి తెలియజేయడంతో పాటు అలాంటి వాటిని అదుపు చేయడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆ ప్రకటన తెలిపింది. దోషులను పట్టుకోవడానికి శాంతిభద్రతల యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నప్పటికీ తగిన టెక్నాలజీని ఉపయోగించి ఇలాంటి రెచ్చగొట్టే మెస్సే.ఇలను తక్షశం అదుపు చేయాలని ప్రభుత్వం వాట్సాప్ యాజమాన్యాన్ని ఆదేశించింది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







