పెరగనున్న వేడి, ఉక్కిరిబిక్కిరి చేయనున్న హ్యుమిడిటీ

- July 04, 2018 , by Maagulf
పెరగనున్న వేడి, ఉక్కిరిబిక్కిరి చేయనున్న హ్యుమిడిటీ

నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, యూఏఈలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరగనున్నాయి. ఈ రోజు పలు చోట్ల ఆకాశం మేఘావృతమై కన్పించినా, మొత్తంగా వేడి వాతావరణమే వుంటుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణ నుంచి ఓ మోస్తరు తీవ్రతతో గాలులు వుంటాయి. గంటకు 35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం వుంది. అరేబియన్‌ గల్ఫ్‌, అరేబియన్‌ గల్ఫ్‌, ఒమన్‌ సముద్రం.. ఓ మోస్తరు రఫ్‌గా వుండనుంది. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటుగా, హ్యుమిడిటీ ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి. 65 నుంచి 90 శాతం వరకు హ్యుమిడిటీ కోస్టల్‌ ఏరియాస్‌లో వుంటుంది. 55 నుంచి 80 శాతం హ్యుమిడిటీ ఇంటర్నల్‌ ఏరియాస్‌లో కన్పించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com