వరంగల్‌లో భారీ అగ్నిప్రమాదం
- July 04, 2018
వరంగల్‌లో భారీ అగ్నిప్రమాదం బాణసంచా గోదాములో చెలరేగిన మంటలు పదిమంది కార్మికుల సజీవ దహనం మృతుల సంఖ్య పెరిగే అవకాశం? కోటిలింగాల: వరంగల్ కోటిలింగాల వద్ద భద్రకాళి ఫైర్ వర్స్క్ గోదాంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పది మంది కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు.కోటిలింగాలలోని భద్రకాళి ఫైర్ వర్క్స్ గోదాములో బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ శబ్దాలతో బాణసంచా పేలింది. ఆ సమయంలో గోదాములో 25 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగిన వెంటనే పలువురు కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. పదిమంది కార్మికులు మంటల్లో సజీవ దహనం కాగా.. మరికొంత మంది ఆచూకీ తెలియడం లేదు. వారు గోదాంలోనే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఒక్కసారిగా భారీ శబ్దాలతో మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలు విషయం తెలుసుకుని వెంటనే ప్రమాదస్థలానికి పరుగులు తీశారు. కార్మికుల మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. క్షతగాత్రులను 108 వాహనాల్లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







