భర్త మళ్ళీ పెళ్ళి: భార్య ఆత్మహత్య

- July 04, 2018 , by Maagulf
భర్త మళ్ళీ పెళ్ళి: భార్య ఆత్మహత్య

షార్జా పోలీసులు 43 ఏళ్ళ ఉజ్బెకిస్తానీ మహిళ ఆత్మహత్య కేసును అత్యంత లోతుగా విచారించి, ఆమె ఆత్మహత్యకు గల కారణాల్ని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అల్‌ దైద్‌లో ఆ మహిళ నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమె తన భర్త, ఐదుగురు చిన్నారులతో కలిసి నివసిస్తోంది. ఆ ఐదుగురు పిల్లల్లో అత్యంత చిన్న వయసు ఏడాది చిన్నారిది కావడం గమనార్హం. ఎమిరేటీ భర్త, మరో వివాహం చేసుకునేందుకు ప్రయత్నించడంతోనే ఈ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మొరాకో మహిళతో తన పెళ్ళి జరగనున్నట్లు ఎమిరేటి వ్యక్తి తన భార్యకు తెలపడంతో, భార్య తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని అటాప్సీ నిమిత్తం లేబరేటరీకి తరలించి, మరణానికి గల కారణాల్ని పరిశీలించనున్నారు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులనుంచి పూర్తి సమాచారాన్ని ఇప్పటికే పోలీసులు రాబట్టారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com