విమాన ప్రయాణం భలే చౌక బేరం.. రూ.999కే స్పైస్‌జెట్ బంపరాఫర్

- July 05, 2018 , by Maagulf
విమాన ప్రయాణం భలే చౌక బేరం.. రూ.999కే స్పైస్‌జెట్ బంపరాఫర్

విమానయాన సంస్థ స్పైస్‌జెట్ మెగా మాన్‌సూన్ ఆఫర్ ప్రకటించింది. జులై 8 వరకు అందుబాటులో ఉన్న ఈ ఆఫర్‌లో తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రారంభం ధర రూ.999గా నిర్ణయించింది.  అయితే ఇది ఒక వైపు ప్రయాణానికి మాత్రమే వర్తిస్తుందని తెలియజేసింది. ఈ సంస్థ జులై 1 నుంచి కొత్తగా 14 డొమెస్టిక్ విమానాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇతర వివరాలకు, ఆఫర్లకు సంబంధించిన మరింత సమాచారం కోసం తమ అధికారిక వెబ్‌సైట్ www.spicejet.com ద్వారా తెలుసుకోవచ్చంటోంది. మరో ముఖ్య విషయం ఈ ఆఫర్ డొమెస్టిక్ విమానాలకు మాత్రమే వర్తిస్తుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com