వెంకీ, వరుణ్ తేజ్‌ల మల్టీస్టారర్ షూటింగ్ ప్రారంభం
- July 05, 2018
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కనున్న మల్టీస్టారర్ నేడు(గురువారం) ప్రారంభమైంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఎఫ్ 2 అనే టైటిల్‌ను.. అలాగే ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే ట్యాగ్‌లైన్‌ను ఖరారు చేసింది చిత్రబృందం. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈ నెల 21 వరకూ కొనసాగనుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో వెంకీ సరసన తమన్నా.. వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ప్రధాన పాత్రలకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్లో ప్లాన్ చేసింది చిత్రబృందం. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







