మూడేళ్ళలో 80 శాతం డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌

- July 06, 2018 , by Maagulf
మూడేళ్ళలో 80 శాతం డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌

2021 నాటికి 80 శాతం డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌ అవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం, బ్యాంకుల్లో డిజిటలైజేషన్‌ ప్రక్రియ ఇలాగే కొనసాగితే ఆ లక్ష్యం చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని ఎన్‌బిబి డిజిటల్‌ బ్యాంకింగ్‌ హెడ్‌, డిజిల్‌ బ్యాంకింగ్‌ ఎక్స్‌పర్ట్‌ సల్మాన్‌ అల్‌ రసీద్‌ అభిప్రాయపడ్డారు. బ్యాంకింగ్‌ రంగంలో డిజిటలైజేషన్‌ సరికొత్త సంచలనాలకు కారణమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 3 నుంచి ఐదేళ్ళలోనే డిజిటలైజేషన్‌ ప్రక్రియ అనూహ్యంగా వృద్ధి చెందనుందని ఆయన అభిప్రాయపడ్డారు. 80 శాతానికి పైగా డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌ జరగాలంటే, దానికోసం ఇప్పటినుంచే మరింత ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com