టాప్‌ 3లో అబుదాబీ, దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లు

- July 06, 2018 , by Maagulf
టాప్‌ 3లో అబుదాబీ, దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లు

అబుదాబీ ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ 2 లోని అల్‌ ఘజాల్‌ లాంజ్‌, బెస్ట్‌ వాల్యూ ఎయిర్‌పోర్ట్‌ లాంజెస్‌లో టాప్‌ ప్లేస్‌ సొంతం చేసుకుంది. 28.76 డాలర్లకే ప్రయాణీకులు, ఈ లాంజ్‌లో సౌకర్యాల్ని పొందే వీలుంది. నెట్‌ ఫ్లైట్స్‌ డాట్‌ కామ్‌ లిస్ట్‌లో మొత్తం 149 ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. అతి తక్కువ కాస్ట్‌, అతి విలాసమైన సౌకర్యాల పరంగా అల్‌ ఘజల్‌ లాంజ్‌ టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. అద్భుతమైన ఇంటీరియర్‌, అవసరమైన సౌకర్యాలు ఈ లాంజ్‌కి ఈ ప్రత్యేకతను ఆపాదించాయి. రెండో స్థానంలో స్ట్రాటా లాంజ్‌, ఆక్లాండ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిలిచింది. దాంతోపాటుగా దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ 3 లాంజ్‌ బి కూడా రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇండియా ఆర్థిక రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ టాప్‌ టెన్‌లో స్థానం సంపాదించుకుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com