ఇజ్రాయెల్:గూఢచారి గడియారం సంపాధించింది

- July 07, 2018 , by Maagulf
ఇజ్రాయెల్:గూఢచారి గడియారం సంపాధించింది

యూదుల గూఢచారి చేతి గడియారం కోసం ఇజ్రాయెల్‌ రహస్య ఆపరేషన్‌ చేపట్టింది. సిరియా రాజధాని డమాస్కస్‌లో ఏడాదిన్నరపాటు గాలించి ఎట్టకేలకు దీన్ని సంపాదించింది. ఎన్నో పరీక్షలు చేసిన తర్వాత ఇది 'ఎలీ కోహెన్‌'దేనంటూ స్వయంగా ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించారు. యూదుడైన కోహెన్‌ 1957లో ఇజ్రాయెల్‌ గూఢచర్య సంస్థ మొసాద్‌లో చేరారు. అయితే 1965 మే 19న చిత్రహింసలు పెట్టి ఆయన్ను సిరియా సైన్యం ఉరితీసింది. ఆయన మృతదేహం ఎవరికీ చిక్కకుండా పలుచోట్లకు మారుస్తూ వచ్చింది. దీని ఆచూకీ కనిపెట్టేందుకు దశాబ్దాల తరబడి ఇజ్రాయెల్‌ ఆపరేషన్లు చేపడుతూనే ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com