ఇరాన్: ఆ యువతి పట్ల శాపంగా మారిన డాన్స్
- July 09, 2018
డాన్స్ చేసిందనే అభియోగంతో ఒక టీనేజీ యువతిని ఇరాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి వ్యతిరేకంగా ఇరాన్ మహిళలు వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు.
టీనేజర్‌ను అరెస్ట్ చేయడం పట్ల వీరంతా తమ డాన్స్‌తో నిరసన తెలుపుతున్నారు.
చాలా మంది ఇరాన్ యువతులు తమ డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పోలీసులు అరెస్టు చేసిన యువతికి అండగా నిలుస్తున్నారు.
మెదేహ్ హోజబ్రీ ఇరానియన్, వెస్ట్రన్ పాప్ సంగీతానికి డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసి వేలాది ఫాలోయర్స్ సంపాదించుకున్నారు.
శుక్రవారం హోజబ్రీ తన నేరాన్ని అంగీకరించినట్టు స్థానిక టీవీ ప్రసారం చేసింది.
ఆమెకు మద్దతుగా సోషల్ మీడియా యూజర్లు వీడియోలు, సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.
#dancing_isn't_a_crime అనే అర్థం వచ్చేలా హాష్‌టాగ్స్ ఉపయోగిస్తున్నారు.
బహిరంగంగా డాన్స్ చేయడంపై నిషేధం
కుటుంబ సభ్యుల ముందు తప్ప, ఇతరుల ముందు, ముఖ్యంగా పురుషులు ముందు మహిళలు, మహిళల ముందు పురుషులు బహిరంగంగా డ్యాన్స్ చేయడంపై ఇరాన్ ప్రభుత్వం నిషేధం విధించింది.
బురఖా / హిజబ్ లేకుండా ఇంట్లో డ్యాన్స్ చేస్తున్నట్టు వీడియోల్లో హోజబ్రీ కనిపించింది.
గత కొన్ని వారాలుగా, ఇలాగే డ్యాన్స్ చేసిన మరికొందరు డ్యాన్సర్లను కూడా ఇరాన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
"పిల్లలపై అత్యాచారాలు చేసేవారు, ఇతరులు స్వేచ్ఛగా తిరుగుతున్నప్పుడు, అసభ్యతను వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలతో సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న 17, 18 ఏళ్ల బాలికలను అరెస్ట్ చేశారని, ప్రపంచంలో ఎక్కడైనా చెబితే నవ్వుతారు. ఎందుకంటే వారు దాన్ని నమ్మలేరు" అని హుస్సేన్ రోనఘీ తన బ్లాగ్‌లో కామెంట్ పెట్టారు.
"నేను డ్యాన్స్ చేస్తున్నా, ఇది చూసి వాళ్లు (అధికారులు) మెదేహ్ లాంటి యువతులను అరెస్ట్ చేసి మా సంతోషాన్ని, ఆశలను తీసుకెళ్లలేరనే విషయం తెలుసుకోవాలి" అని ఒక ట్విటర్ యూజర్ రాశారు.
డాన్స్ చేసినందుకు ఇరాన్‌లో డ్యాన్సర్లను అరెస్ట్ చేసిన ఘటనలు ఇంతకు ముందు కూడా జరిగాయి. ఈ ఏడాది మొదట్లో మష్షద్ నగరంలోని ఒక మాల్‌లో మహిళలు, పురుషులు గుంపుగా డ్యాన్స్ చేసినట్టు ఒక వీడియో బయటపడడంతో ఆ నగరంలోని ఒక అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది ఆగస్టులో జుంబా డ్యాన్స్ చేసిన ఆరుగురిని కూడా అరెస్ట్ చేశారు.
2014లో ఫార్రెల్ విలియమ్స్ 'హ్యాపీ' పాటకు టెహ్రాన్ వీధుల్లో డాన్స్ చేసిన ఆరుగురు ఇరాన్ యువతీ, యువకులు ఆ వీడియోను పోస్ట్ చేశారు. వారికి ఏడాది జైలు, 91 కొరడాదెబ్బల శిక్ష విధించారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







