సమంత గురించి చైతూ చెప్పిన గుడ్ న్యూస్!
- July 10, 2018
అక్కినేని నట వారసుడు నాగచైతన్య అక్కినేనితో పెళ్లి తర్వాత కూడా సమంత సక్సెస్ జోరు కొనసాగుతూనే ఉంది. 2018 సంవత్సరం సమంతకు బ్లాకబస్టర్లను అందించింది. సమంత నటించిన రంగస్థలం, మహానటి, అభిమన్యుడు (ఇరంబు తిరై) లాంటి చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి. ఇలాంటి పరిస్థితుల్లో సమంత సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారనే వార్త వైరల్ అయింది. అయితే ఆ వార్తకు సంబంధించిన విషయంపై నాగచైతన్య వివరణ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే..
ఆ వార్తలో వాస్తవం లేదు
2019లో సినిమాలకు గుడ్ బై చెబుతారనే వార్త నా దృష్టికి వచ్చింది. మార్చి 2019లో కల్లా అంగీకరించిన అన్ని సినిమాలను పూర్తి చేసి పరిశ్రమకు దూరంగా ఉండబోతుందనే వార్త మీడియాలో వైరల్‌గా మారిన విషయం మాకు తెలిసింది. అయితే ఆ వార్తలన్నీ అబద్ధాలే. అందులో ఎలాంటి వాస్తవం లేదు అని చైతూ స్పష్టం చేసినట్టు ఆంగ్ల దినపత్రిక వెల్లడించింది.
బ్రేక్ తీసుకొంటారు.. కానీ
సమంత సినిమాలకు గుడ్‌బై చెప్పదు. చేతి నిండా సినిమాలతో ఆమె బిజీగా ఉన్నారు. ఒకవేళ అవసరమైతే సామ్ బ్రేక్ తీసుకుంటారు. కానీ సినిమాలను వదులుకోదు. వాటికి దూరంగా ఉండదు అని నాగచైతన్య క్లారిటీ ఇచ్చారు.
ఇద్దరం జంటగా నటిస్తున్నాం..
సమంత, చైతూ ఇద్దరు కలిసి నిన్ను కోరి చిత్ర దర్శకుడు శివ నిర్వాణ రూపొందించే చిత్రంలో నటించనున్నారు. కథ డిమాండ్ మేరకు సమంత, నేను కలిసి నటిస్తే బాగుంటుంది అని దర్శకుడు కోరాడు. పెళ్లి తర్వాత దంపతుల జీవితంలో చోటుచేసుకొన్న అంశాల ఆధారంగా రూపొందనున్నది. ఆ కథకు తగ్గట్టుగా తాము ఉంటామని దర్శకుడు భావించారు. అందుకే కలిసి నటించాలని అనుకొన్నాం అని చైతూ పేర్కొన్నారు.
శైలజారెడ్డితో చైతూ బిజీ
నేను నటించే చిత్రాల గురించి సమంత చర్చిస్తుంది. అదేలా ఉంటుందంటే.. గతంలో మా నాన్న కేర్ తీసుకునే వారు. ఇప్పుడు అదనంగా సమంత నా గురించి, నా కెరీర్ గురించి కేర్ తీసుకొంటున్నారు అని చైతూ చెప్పారు. ప్రస్తుతం నాగ చైతన్య సవ్యసాచి, శైలజారెడ్డి అల్లుడు చిత్రాలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







