ఆఫ్ఘన్లో ఆత్మాహుతి దాడి భీభత్సం
- July 10, 2018
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లోని జలాలాబాద్‌లోని చెక్‌పాయింట్ వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఆఫ్ఘన్ భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ ఆత్మాహుతి దాడిలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు ఉన్నట్లు నాన్గర్హర్ ప్రొవిన్షియల్ గవర్నర్ మీడియాకు వెల్లడించారు. మరో నలుగురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మాహుతి దాడికి అక్కడున్న పలు వాహనాలు, దుకాణాలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. సూసైడ్ అటాక్ నేపథ్యంలో అక్కడి భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. జలాలాబాద్‌లో జూలై 1న జరిగిన దాడుల్లో 19 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







