ఏడ్చేసిన సోనాలి
- July 10, 2018
కొంతకాలంగా తాను హైగ్రేడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నానని నటి సోనాలి బింద్రే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధితో ధైర్యంగా పోరాడతానని, త్వరగా కోలుకునేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్నారు. కీమోథెరపీ నిమిత్తం సోనాలి తన జుట్టును కత్తిరించుకున్నారు. న్యూయార్క్‌లోని ఓ సెలూన్లో హెయిర్ కట్ చేయించుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 'మనలో దాగున్న బలాన్ని బలవంతంగా బయటపెట్టేంత వరకు మనమెంత దృఢంగా ఉన్నామో చెప్పలేం. కొన్ని రోజుల నుంచి నాకు ఎందరో మద్దతు తెలుపుతూ వచ్చారు. క్యాన్సర్‌తో పోరాడిన వారు కూడా తమ అనుభవాలను పంచుకుంటూ నాకు ధైర్యం చెప్పారు. వారందరికీ కృతజ్ఞతలు. మీరు పంచుకున్న విషయాలన్నీ నాలో మరింత ధైర్యాన్ని నింపాయి. పోరాడే శక్తినిచ్చాయి.
ముఖ్యంగా..నేను ఒంటరిగా లేనన్న విషయాన్ని తెలియజేశాయి. ప్రతీ క్షణం పాజిటివిటీతోనే ఉండాలని అనుకుంటున్నాను.' అని తెలిపారు. అయితే సోనాలికి జుట్టు కత్తిరిస్తున్నప్పుడు తీసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అద్దంలో తనని తాను చూసుకుంటూ సోనాలి ఉద్వేగానికి లోనయ్యారు.
ఈ వీడియో చూసిన వారంతా ఆమె త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు కామెంట్లు పెడుతున్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







