ఇరాన్:నిరసన డ్యాన్స్‌ల వెల్లువ
- July 11, 2018
ఇరాన్‌లో ఇటీవల 18 ఏళ్ల టీనేజ్ అమ్మాయి మేదేహ్ హోజాబ్రి తాను డ్యాన్స్ చేసిన వీడియోలను ‘ఇన్‌స్టాగ్రామ్’లో అప్‌లోడ్ చేసినందుకు ఇరాన్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ సంఘటన ఓ ఉద్యమానికే ఊపిరిపోసింది. టీనేజ్ అమ్మాయి అరెస్ట్‌ను నిరసిస్తూ ఇరానీ మహిళలు ఇళ్లలో వీధి కూడళ్లలో డ్యాన్స్ చేస్తున్నారు. వాటి వీడియోలను ‘డాన్సింగ్‌ఈజ్‌నాట్‌క్రైమ్’, డాన్సింగ్‌టుఫ్రీడమ్’ హాష్ ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు.
ఇలా వీడియోలను అప్‌లోడ్ చేసిన ఒకరిద్దురు మహిళలను ముందుగా అరెస్ట్ చేసిన పోలీసులు, పుంఖానుపుంఖంగా వచ్చి పడుతున్న వీడియోలను చూసి ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. ఇరానీ మహిళలు తమ ఇళ్లలో, ఇంటి ముందు బ్యాక్ గ్రౌండ్‌కు మ్యూజిక్ అనుగుణంగా డ్యాన్సులు చేస్తున్నారు. వాటిని వీడియోలుగా చిత్రీకరిస్తున్నారు. ఇక వీధి కూడళ్లలో అయితే మగవాళ్ల కచేరి వాయిద్యాల మధ్య మహిళలు నృత్యం చేస్తున్నారు. కొన్ని చోట్ల మగవాళ్లు ఆడవాళ్ల డ్యాన్సులకు మద్దతుగా చిన్నపాటి ఉపన్యాసాలు కూడా ఇచ్చి మహిళలను ప్రోత్సహిస్తున్నారు.
డ్యాన్స్ వీడియోల కారణంగా అరెస్టయిన ఇరానీ టీనేజ్ అమ్మాయికి మద్దతుగా ఇప్పటికే బ్రిటీష్ మహిళలు డాన్స్ వీడియోలను బీబీసీకి పంపిస్తున్నారు. బీబీసీ వారు వాటిని ప్లే చేస్తున్నారు. డ్యాన్స్ చేస్తే ఇరానీ అమ్మాయిలను అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఓ పాటకు డ్యాన్స్ చేసి ఆ వీడియోలను పోస్ట్ చేసిన ఆరుగురు మహిళలను 2014లో మొదటిసారి ఇరానీ పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలు డ్యాన్స్ చేయడం కుసంస్కారం, చట్ట విరుద్ధ చర్య అన్నది పోలీసుల వాదన. అప్పుడు కూడా అరెస్ట్‌లకు నిరసనగా పలువురు మహిళలు డ్యాన్స్ చేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







