థాయిలాండ్ గుహ నుంచి పిల్లలను రక్షించడంలో భారత్‌కు చెందిన కిర్లోస్కర్ పాత్ర..
- July 11, 2018
వారంతా భావి తరం ఫుట్‌బాల్ ప్లేయర్లు. దానికంటే ముందు మృత్యుంజయులు ఈ చిన్నారులు. మాస్కోలో జరుగుతున్న ఫీఫా వరల్డ్ కప్ ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు కోచ్ ఎక్కాపోల్ చాంతవాంగ్‌తో కలిసి 12 మంది బాలురు వెళుతున్నారు. మధ్యలో ఆటవిడుపు కోసం థాయ్ గుహలోకి వెళ్లారు. అనుకోకుండా వచ్చిన భారీ తుఫాను కారణంగా గుహలో చిక్కుకుపోయారు వీరంతా. బయట పడే మార్గం లేదు చుట్టూ నీళ్లు. జూన్ 23న వీరు ఆ గుహలోకి ప్రవేశించారు. నిన్నటికి మొత్తం 17 రాత్రులు చీకటి గుహలో చుట్టూ నీళ్ల మధ్యే గడిపినా ఏ మాత్రం భయపడకుండా కోచ్ ఇచ్చిన ధైర్యంతో గుహలోనించే అమ్మానాన్నలకు అధైర్యపడవద్దంటూ మెసేజ్‌లు పంపించారు.
ఇదంతా కోచ్ ఇచ్చిన ప్రోత్సాహమే. వారి ఆత్మ విశ్వాసం ముందు విధ్వంసం సృష్టించాలనుకున్న ప్రకృతి కూడా మోకరిల్లినట్లైంది. కోచ్ ఎక్ చిన్న వయసులోనే తల్లిదండ్రులను, సోదరుడిని కోల్పోయాడు. జీవితంలో కష్టం అంటే ఏమిటో అప్పుడే కళ్లముందు కనిపించింది. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కునే ధైర్యాన్ని నింపింది. దానికి తోడు ఎక్ చాలా ఏళ్లు బౌద్ధారామంలో గడపడం కూడా గుహలో చిక్కుకున్నప్పుడు ధైర్యాన్ని కోల్పోకుండా చేసింది. ఆయన ఆత్మవిశ్వాసానికి జోహార్లర్పిస్తూ వారికి సాయం చేయడానికి దేశాలన్నీ తరలివచ్చాయి. మనపిల్లలే అందులో చిక్కుకుపోయారేమో అన్నంత ఆత్రంగా ప్రపంచమంతా ప్రతిస్పందించింది.
అందులో మన భారతదేశం కూడా ఉంది. మన దేశానికి చెందిన కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ సంస్థ వారు మన దౌత్య కార్యాలయం నుంచి థాయ్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. వారి అంగీకారంతో రంగంలోకి దిగిన కిర్లోస్కర్ టీమ్ మహారాష్ట్రలో కిర్లోస్కర్ వాడీ ప్లాంట్‌లో ఉన్న ప్రత్యేకమైన నాలుగు హైకెపాసిటీ ఆటో ప్రైమ్ డీవాటరింగ్ పంపులను థాయ్‌లాండ్‌కు పంపించింది. గుహచుట్టూ పెరిగిపోతున్న నీటిమట్టాన్ని తగ్గించడంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన కిర్లోస్కర్ నీటిని బయటకు పంపించింది. పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించింది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







