'RX100' మూవీ షార్ట్ రివ్యూ ..

- July 11, 2018 , by Maagulf
'RX100' మూవీ షార్ట్ రివ్యూ ..

ప్పటివరకు తెలుగు లో ఎన్నో ప్రేమకథలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన RX100 అన్ని ప్రేమకథల మాదిరిగా కాకుండా కాస్త కొత్తదనం తో చూపించాడు డైరెక్టర్ అజయ్ భూపతి. కొత్త నటి నటులు అయినప్పటికీ తెరమీద చాల అనుభవం ఉన్న నటులుగా తమ నటనను కనపరిచారు.

పల్లెటూరి వాతావరణంలో స్వచ్ఛమైన ప్రేమను, ప్రేమ కథను తెరపై చూపించాడు డైరెక్టర్. అయితే తన ప్రేమ కోసం హీరో పోరాటం చేస్తున్నప్పుడు ఎదురయ్యే హింసను కూడా బాగా చూపించారు. హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్‌ను చాలా బోల్డ్‌గా చూపించాడు. ఇక ఫస్ట్ హాఫ్ మాములు కథలాగే అనిపిస్తుంది. కానీ ప్రీ క్లైమాక్స్‌కు వచ్చేసరికి ఏం సినిమారా..! అనకమానరు. సెకండాఫ్‌ను దర్శకుడు అంత బాగా తెరకెక్కించారు. వాస్తవానికి సినిమాను నిలబెట్టే ట్విస్ట్ ఒకటి సెకండాఫ్‌లో వస్తుంది. అదేంటో మీరు సినిమా చూస్తే తెలుస్తుంది.

ఓవరాల్ గా RX100 ఆకట్టుకునే లవ్ స్టోరీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com