అక్కినేని అంతర్జాతీయ అవార్డుల వేడుక'
- December 12, 2015
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఆశయాలకు అనుగుణంగా అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఏఎఫ్ఏ) పని చేస్తోందని చైర్మన్ తోటకూర ప్రసాద్ అన్నారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సామాజిక సేవ, దృక్పథం, కష్టపడే స్వభావం వంటి సులక్షణాలకు అక్కినేని మారుపేరని కొనియాడారు. అక్కినేని పేరు మీద అవార్డు నెలకొల్పి సమాజానికి సేవ చేస్తున్న వివిధ రంగాల ప్రముఖులకు అందజేస్తున్నామని ప్రసాద్ ఓ ప్రకటనలో తెలియజేశారు. దీనిలో భాగంగా ఏఎఫ్ఏ రెండో వార్షికోత్సవ సందర్బంగా 'అక్కినేని అంతర్జాతీయ అవార్డుల వేడుక'ను డిసెంబర్20న ఫిల్మ్ నగర్ లో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ అవార్డుల ఫంక్షన్ కి తమిళనాడు గవర్నర్ కే రోశయ్య ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అవార్డు గ్రహితలు: లైఫ్ టైం అచివ్ మెంట్ అవార్డు: సూపర్ స్టార్, కృష్ణ విశిష్ట వ్యాపార రత్న: ఏవీఆర్ చౌదరి(జీ&సీ గ్లోబల్) సినీ రత్న: కైకాల సత్యనారాయణ రంగస్థల రత్న: కర్నతి లక్ష్మీ నర్సయ్య(ప్రజానటుడు) విద్యారత్న: చుక్కారామయ్య(ఐఐటీ రామయ్య) విద్యారత్న: గుల్లా సూర్య ప్రకాశ్ సేవా రత్నా: డా.సునితా కృష్ణన్ యువరత్న: కుమారి పూర్ణమలావత్(ఎవరెస్ట్ అధిరోహకురాలు) చేనేతకళారత్న: నల్లా విజయ్ అంతేకాకుండా 'యువతను ప్రభావితం చేస్తున్న సామాజిక సవాళ్లు, వాటిపరిష్కారాలు' అనే అంశం మీద 6 నిమిషాలలోపు నిడివిగల షార్ట్ పిల్మ్ పోటీల్లో గెలుపొందినవారికి లక్షరూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







