బాలీవుడ్ ను కుదిపేస్తున్న టబు వ్యాఖ్యలు
- July 13, 2018
టాలీవుడ్ లో వెంకటేష్ హీరోగా కూలి నెంబర్ వన్ మూవీతో హీరోయిన్ గా ఆరంగేట్రం చేసిన టబు వరుస విజయాలతో తెలుగులో అగ్ర హీరోయిన్ స్థాయికి చేరింది. ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా తన హవా సృష్టించిన ఈ ముంబై బ్యూటీ ఎందరో అగ్ర హీరోలతో కల్సి పనిచేసింది. సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఏలిన టబు కి ప్రస్తుతం 46ఏళ్ళు. ఇక తాజాగా ఓ ఇంటర్యూలో సంచలన విషయాలను వెల్లడించింది. ఉత్తరాదికి చెందిన టబు ఇంతవరకూ తను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఓ స్టార్ హీరో అని చెప్పేసింది. ఆమె చెప్పిన వెల్లడించిన విషయాలు సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. ఇప్పటికీ నేను ఒంటరిగా ఉంటున్నా,అయితే ఒంటరి అనే ఫీలింగ్ లేదు.
ప్రతి నిమిషం కూడా సంతోషంగానే ఉంటున్నా.. పెళ్లి చేసుకుని వైవాహిక జీవితం గడపడం మంచిదా,ఒంటరి లైఫ్ మంచిదా అని అందరూ అడుగుతారు. అయితే నాకు ఓ వైపు జీవితం గురించే తెల్సు. నా జీవితంలో మరో జీవితం అనే అనుభవం లేదు. అందుకే ఆ ప్రశ్న కు చెప్పలేను. అయితే మ్యారేజ్ చేసుకుంటే మరింత సంతోషంగా ఉండేదాన్నేమో' అంటూ టబు చెప్పుకొచ్చింది.
ఇక తన పెళ్లి కాకపోవడానికి నటుడు అజయ్ దేవగన్ అని టబు సంచలన నిజాన్ని వెల్లడించింది. అజయ్ తన కజిన్ సమీర్ పక్కనే ఉండేవాడు. అప్పట్లో తాను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అయ్యేవాడు. నన్ను నిరంతరం నీడలా వెంటాడేవాడు.
అంతేకాదు నాతో వేరే అబ్భాయిలు ఎవరైనా మాట్లాడితే తట్టుకోలేక పోయేవాడు. ఒక్కో సమయంలో వాళ్ళతో ఫైట్స్ కి దిగేవాడు. అజయ్ ప్రేమను గుర్తుంచుకుని ఇంతవరకూ పెళ్లి ఊసెత్తలేదు. అజయ్ ఈ విషయాన్ని ఇప్పటికైనా గ్రహిస్తాడని అనుకుంటున్నా'అని టబు తన మనసులో దాచుకున్న విషయాలను ఇంటర్యూలో పంచుకుంటూ, అజయ్ తో సాగించిన ఎఫైర్ గురించి బాంబ్ పేల్చింది.
ఇప్పుడున్న హీరోల్లో అజయ్ అంటే ఇష్టమని, తమ బంధం వైవిధ్యంగా సాగే స్పెషల్ ఘటన అని,తాను చిన్నపిల్లలా ప్రవర్తించినపుడు పరిపూర్ణమైన వ్యక్తిలా చూసుకున్నాడని టబు సంచలన నిజాలను బయట పెట్టేసింది. 'నా జీవితం ఆరంభం నుంచి అజయ్ నాతొ ఉన్నాడు. పాతికేళ్ళు సాన్నిహిత్యంగా మెలిగాం.
అతని వల్లనే తాను పెళ్లి చేసుకోలేదన్న బాధ కూడా లేదని అజయ్ తో కల్సి పలు చిత్రాల్లో నటించిన టబు చెప్పింది. కాగా అజయ్ 1999లో నటి కాజోల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెల్సిందే. అయితే ఇప్పుడు టబు వ్యాఖ్యలు బాలీవుడ్ ని ఊపేస్తున్నాయి.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







