విజేత విజయోత్సవానికి ముఖ్య అతిధిగా అల్లు అర్జున్
- July 15, 2018
తండ్రీ కొడుకుల మధ్య జరిగే ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం విజేత. మెగా స్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళు బాగానే రాబడుతుందని అంటున్నారు. వారాహి చలనచిత్రం బ్యానర్‌లో సాయి కొర్రపాటి సారథ్యంలో రజినీ కొర్రపాటి నిర్మించిన 'విజేత' చిత్రానికి రాకేశ్ శశి దర్శకత్వం వహించారు. మాళవిక నాయర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో మురళీ శర్మ ముఖ్య పాత్ర పోషించారు.
విజేత చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో చిరు, రామ్ చరణ్, ఉపాసన కళ్యాణ్ దేవ్‌తో పాటు చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన వంతు బాధ్యతని నిర్వర్తించబోతున్నారు. చిత్రం మంచి విజయం సాధించడంతో విజయోత్సవ వేడుకని ప్లాన్ చేశారు నిర్మాతలు. ఈ రోజు మధ్యాహ్నం జరగనున్న జరగనున్న వేడుకకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్‌గా హాజరు కానున్నాడు. దీనికి సంబంధించిన వివరాలను తెలుపుతూ.. చిత్ర యూనిట్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.
చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించగా 'బాహుబలి' కెమెరామెన్ కె.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







