కేన్సర్ రోగులను పరామర్శించిన జగపతిబాబు
- July 15, 2018
విజయవాడ: ప్రముఖ సినీనటుడు జగపతిబాబు ఆదివారం విజయవాడలో పర్యటించారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ పదో వార్షికోత్సవం సందర్భంగా ఆయన సంస్థను సందర్శించారు. లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ దశలో ఉన్న రోగులను జగపతిబాబు పలకరించారు. క్యాన్సర్ రోగులకు రూట్స్ ఫౌండేషన్ ఉచితంగా అందిస్తున్న సేవలు చూసి ఆయన హర్షం వ్యక్తం చేశారు. స్వలాభం కోసం జీవించే ఈ పరిస్థితుల్లో ఇలా స్వచ్చందంగా సేవ చేయడం అభినందనీయమని ప్రశంసించారు. చివరి రోజులు గడుపుతున్న క్యాన్సర్ రోగుల బాధను పంచుకుని వారకి అండగా ఉంటున్న ఈ స్వచ్చంద సంస్థ సభ్యులు అభినందిస్తున్నట్టు చెప్పారు.
రోజులు లెక్కపెట్టుకుంటూ బతకడం ఎంత కష్టమో అందరికీ తెలుసని.. ఇలాంటి స్వచ్చంద సంస్థలలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 'సైరా' చిత్రంలో జగపతిబాబు నటిస్తున్నారు. అయినప్పటికీ ఆదివారం తన షూటింగ్‌ను సర్దుబాటు చేసుకుని మరి ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. చివరి రోజులు గడుపుతున్న కేన్సర్ బాధితులకు అండగా నిలబడి సేవ చేస్తున్న రూట్స్ ఫౌండేషన్ సభ్యులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని జగపతిబాబు తెలిపారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..