తేజ్ అమెరికా యాత్ర
- July 15, 2018
వరస పరాజయాలతో సతమతమైపోతున్న సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ 'తేజ్ ఐ లవ్యూ' ఘోర పరాజయం తరువాత కనీసం తన సన్నిహితులతో కలవడానికి కూడ ఇష్టపడటం లేదు అని గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. గతంలో 25 కోట్లు మార్కెట్ ఉన్న సాయి ధరమ్ తేజ్ చిత్రాలకి ఇప్పుడు కనీసం అయిదు కోట్ల షేర్ కూడా రాకపోవడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.
'ఇంటిలిజెంట్' చిత్రానికి నాలుగు కోట్ల కంటే తక్కువ షేర్ వస్తే లేటెస్ట్ మూవీ 'తేజ్ ఐ లవ్యూ' కి అంతకన్నా తక్కువ షేర్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు వరస ఫ్లాపుల బెంగతో డిప్రెషన్ కి గురవుతూ లావెక్కిపోతోన్న తేజ్ ఇక్కడ ఉండి తెలిసిన వారి సానుభూతి మాటలు వినడం కంటే అమెరికా వెళ్ళి తన ఫిజిక్ కరెక్ట్ చేసుకుని రావాలని అమెరికా వెళ్లిరావడానికి తన ప్లాన్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
యుఎస్ లోని ట్రెయినర్లు డాక్టర్ల సహాయంతో బరువు తగ్గడానికి సాయి ధరమ్ తేజ్ అమెరికాలో మూడు నెలలు ఉండబోతున్నట్లు టాక్. తన ఫిజిక్ లో కొంత మార్పు వచ్చాక ప్రస్తుతం అతడునటిస్తున్న 'చిత్రలహరి' మొదలుపెట్టాలని తేజ్ ప్లాన్ అని అంటున్నారు. ఈమూవీ తరువాత చేయబోయే సినిమాల విషయంలో కూడ తన అమెరికా పర్యటన తరువాత ఒక క్లారిటీ ఇస్తానని తనను కలుస్తున్న కొందరు దర్శక నిర్మాతలకు చెపుతున్నట్లు సమాచారం.
ఈ మధ్య తన జుట్టు విపరీతంగా రాలిపోతున్న నేపధ్యంలో బయట పడుతున్న బాల్డ్ ప్యాచెస్ ను కవర్ చేయించుకోవడానికి హెయిర్ ట్రీట్ మెంట్ కూడ అమెరికాలో చేయించుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఏమైనా ఈఅమెరికా పర్యటన తరువాత తేజ్ తన కొత్త లుక్ తో మెప్పించగలిగితే అతడు కోరుకున్న అవకాశాలు వస్తాయేమో చూడాలి..
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!