40 రోజులు లాక్ అయిన ప్రభాస్
- July 15, 2018
బాహుబలి చిత్రం తో దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..ప్రస్తుతం 'రన్ రాజా రన్' ఫెమ్ సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రం లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తుండగా , బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. గత నెల క్రితం దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ , మూడు రోజుల క్రితం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది.
ఈ షెడ్యూల్ దాదాపు 40 రోజుల పాటు జరుగనుంది. సినిమాలోని కీలక సన్నివేశాలను ఇక్కడ షూట్ చేస్తారని సమాచారం. తెలుగు , తమిళ , హిందీ భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రానికి శంకర్-ఎహసాన్ -లాయ్ లు సంగీతం అందిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!