రజనీని టార్గెట్ చేసిన కంగనా !
- July 16, 2018
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ని టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రజనీ రోబో '2.ఓ' తరచూ వాయిదా పడుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేటుని ఫిక్స్ చేశారు. నవంబర్ 29న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రజనీ రాకతో మిగితా సినిమాలు సడైపోయాయి. ఐతే, బాలీవుడ్ క్వీన్ కంగనా మాత్రం తగ్గడం లేదట.
క్రిష్ దర్శకత్వంలో కంగనా 'మణికర్ణిక' తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా అనేకమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేసినట్టు తెలిసింది. ఈ సినిమాని కూడా రోబో 2.ఓ విడుదల డేటు నవంబర్ 29 న రిలీజ్ చేస్తున్నారట. ఇది ఇండస్ట్రీకి షాక్ కు గురి చేస్తోంది. రజనీతో కంగానా పోటీ పడటం ఆమెకే లాస్ అని చెబుతున్నారు. ఝాన్సీ రాణి జీవితం ఆధారంగా మణికర్ణిక తెరకెక్కింది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







