ఫుట్ బాల్ ఫ్యాన్స్ కి పుతిన్ బంపరాఫర్ !
- July 16, 2018
రష్యాలో దాదాపు నెలన్నరపాటు ప్రపంచ ఫుట్ బాల్ అభిమానులను అలరించిన ఫిఫా వరల్డ్ కప్-2018 పోటీలు ముగిశాయి. ఉత్కంఠగా సాగిన పోరులో ఫ్రాన్స్ జట్టు క్రొయేషియాపై 4-2 తేడాతో విజయం సాధించి కప్పు ఎగరేసుకుపోయింది. టోర్నీ సక్సెస్ కావడంతో హ్యాపీగావున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫుట్ బాల్ అభిమానులకు బంపరాఫర్ ఇచ్చేశారు. మ్యాచ్‌లను చూసేందుకు 'ఫ్యాన్ ఐడీ' కార్డులతో తమ దేశానికి వచ్చిన విదేశీయులు, ఈ ఏడాదంతా ఎలాంటి వీసా ఫీజులు చెల్లించకుండా ఎన్నిసార్లయినా రష్యా వచ్చి వెళ్లవచ్చని స్టేట్‌మెంట్ ఇచ్చేశారు.
ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు టికెట్ కొనుగోలు చేసిన విదేశీయులు, దేశంలో దిగగానే ఈ 'ఫ్యాన్ ఐడీ' ఇస్తారు. ఈ ఐడీలు మామూలుగా అయితే, ఈ నెల 25తో ఎక్స్ పైర్ అయిపోతాయి. ఇప్పుడీ ఫ్యాన్ ఐడీ చూపించి, సంవత్సరం చివరి వరకూ ఎన్నిసార్లయినా పర్యటించవచ్చని పుతిన్ ఆఫర్ ఇచ్చారు. ఇది పుతిన్ మైండ్ లో పుట్టిన ఈ బిజినెస్ ఆలోచన వల్ల తమ దేశానికి టూరిస్టుల సంఖ్య పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







