దొంగాట : రివ్యూ

- May 08, 2015 , by Maagulf
దొంగాట : రివ్యూ

మంచు వారి ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన మరో ప్రోడక్ట్ దొంగాట. ఈ సారి దొంగాట కోసం టాలీవుడ్ సక్సెస్ఫుల్ ఫార్మాట్ అయిన క్రైమ్ కామెడీ ఫార్మాట్ ని ఎంచుకున్నారు. ఆ జోనర్ కోసం కాన్సెప్ట్ ని కూడా బాగానే ఎంచుకున్నారు కానీ ఎగ్జిక్యూషన్ విషయానికి వచ్చే సరికి సిల్క్ స్మితకి ఎక్కువ జ్యోతి లక్ష్మీకి తక్కువ అన్న స్టైల్లో సినిమాని అబో యావరేజ్ కి ఎక్కువ హిట్ సినిమాకి తక్కువ అనిపించేలా చేసారు. సినిమాలో కొన్ని థ్రిల్స్ ని సూపర్బ్ గా రాసుకున్నారు. సూపర్బ్ గా డీల్ చేసాడు, అలాగే కొన్ని కామెడీ ఎపిసోడ్స్ ని బాగా రాసుకున్నారు, బాగా తీసారు కానీ.. కొన్ని కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే బాగుంటే ఆడియన్స్ ని రెండు గంటల 20 నిమిషాలు కూర్చో బెట్టడం కష్టం అందుకే ఆద్యంతం ఆసక్తిగా ఉండేలా ప్లాన్ చేసుకోవాల్సింది.ఓవరాల్ గా మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన డీసెంట్ అటెంప్ట్ దొంగాట. మంచు లక్ష్మీ, అడవి శేష్ ల నటన, చివరి 30 నిమిషాల్లో వచ్చే థ్రిల్స్, ఇంటర్వల్ బ్లాక్ సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యాయి. ఓవరాల్ దొంగాట సమ్మర్ సీజన్ కావడం వలన ఈ వారంతం రెగ్యులర్ ప్రేక్షకులను అలా ఎంటర్టైన్ చేసి వెళ్ళిపోయే పాసబుల్ సినిమా. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com