భాగ్యనగరంలో లిక్కర్ చాక్లెట్లు.. నగర విద్యార్థులే టార్గెట్
- July 17, 2018
డబ్బు సంపాదించాలి. అక్రమంగా, అన్యాయంగా.. ఎవరి జీవితాలతో మనకి పనిలేదు. అందునా భావి భారత పౌరులే వారి టార్గెట్. అభం శుభం తెలియని చిన్నారులను ఇలాంటి అన్యాయాలకు బలి చేస్తున్నారు. చిన్నారులకు ఇష్టమైన చాక్లెట్లనే ఎరగా వేసి దందా సాగిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా చేసుకుని హైదరాబాద్ నగరంలో లిక్కర్ చాక్లెట్ల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. పైకి మామూలు దుకాణంలానే కనిపిస్తుంది. కానీ లోపల జరిగే దందా వేరేగా ఉంటుంది. లిక్కర్ చాక్లెట్ల వ్యాపారాన్ని గుట్టు చప్పుడు కాకుండా సాగిస్తున్నారు.
వీటికి విస్కీ, రమ్ము అంటూ బ్రాండ్ పేర్లు పెట్టి మరీ వ్యాపారం జరుపుతున్నారు. ఇవే కాకుండా బ్లెండర్ స్పైడ్, బాంబే సాప్పేర్ జిన్, వైట్ మిషెప్ ఒడ్కా వంటి పేర్లతో కూడా చాక్లెట్లను తయారు చేస్తోంది ఈ ముఠా. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అబిడ్స్, బేగం బజార్, బంజారా హిల్స్, అమీర్ పేట్, ఎస్సార్ నగర్‌తో పాటు మరికొన్ని చోట్ల దాడులు జరిపి ముఠా గుట్టుని బట్టబయలు చేశారు. నగరంలోని పలు స్కూల్ విద్యార్థులు ఈ చాక్లెట్ల మత్తులో పడిపోతున్నారని పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తనిఖీల్లో సీజ్ చేసిన చాక్లెట్ల విలువ భారీగానే ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!







