ఉగ్రవాద సంస్థల ఖాతాలు బ్లాక్ చేయనున్న ఫేస్‌బుక్
- July 17, 2018
పాకిస్తాన్‌లో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫేస్‌బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి మార్క్ జూకర్‌బర్గ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాద కార్యకలపాలను ప్రోత్సహించే సంస్థల ఖాతాలను బ్లాక్ చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. జూలై 25 నుంచి పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు సహకరించాలని, చట్టబద్ధంగా నమోదు చేయని సంస్థలను రద్దు చేయాలని పాక్ ఎన్నికల కమిషన్ ఇటీవల జూకర్‌బర్గ్‌ను కోరింది. దీనిపై స్పందించిన బర్గ్ ఎన్నికల నేపథ్యంలో అల్లర్లు సృష్టించే వివాదాస్పద సంస్థల పేజీలకు, ఫేక్ ఎకౌంట్లను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఫేస్‌బుక్ రద్దు చేసిన వాటిలో ముంబై దాడులు సూత్రదారి హఫీజ్ సయ్యద్ స్థాపించిన జమత్-ఉద్-దావా, ఇస్లామిక్ మల్లీ ముస్లిం లీగ్ (ఎమ్‌ఎమ్‌ఎల్) సంస్థలు ఉన్నాయని ఫేస్‌బుక్ వర్గాలు వెల్లడించాయి. త్వరలో ఎన్నికలు జరుగనున్న భారత్, బ్రెజిల్, మెక్సికో దేశాల్లో కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తామని జూకర్‌బర్గ్ ప్రకటించారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







