రియాద్ లో వ్యక్తి హత్య కేసు..ఐదుగురిని ఉరితీశారు
- July 17, 2018
రియాద్: వేర్‌హౌజ్ గార్డు హత్య కేసులో దోషులను సౌదీ అరేబియా ప్రభుత్వం ఉరితీసింది. ఐదుగురిలో ఇద్దరు సౌదీ అరేబియా దేశస్థులు కాగా..ముగ్గురు చాద్ దేశస్థులున్నారు. ఐదుగురు వ్యక్తులు జెడ్డాలో పాకిస్థాన్ వేర్‌హౌజ్ గార్డుపై దాడి చేసి..అతని మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. ఈ దాడిలో గార్డు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి అరస్టైన ఐదుగురు దోషులను ఉరి తీశామని సౌదీ అరేబియా అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. సాదీలో సాధారణంగా ఉరిశిక్ష బహిరంగంగా అమలు చేస్తుంటారు. అయితే దోషులు ఎక్కడ, ఎప్పుడు ఈ నేరం చేశారు.. వారిని ఎక్కడ ఉరితీశారనే విషయంపై మాత్రం అధికారులు స్పష్టత ఇవ్వలేదు. 2018లో సౌదీ ప్రభుత్వం 64 మందికి ఉరిశిక్ష అమలు చేసింది. 2017లో 122 మంది, 2016లో 144 మందిని ఉరితీసింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







