దర్శకుడు చిన్నా...
- December 12, 2015
''ఆరేళ్ల క్రితం 'ఆ ఇంట్లో' సినిమాతో దర్శకునిగా పరిచయమయ్యా. ఆ తర్వాత అప్పుడప్పుడు కొన్ని పాత్రలు చేస్తూ వచ్చా. మంచి కథ కుదిరితేనే మళ్లీ డెరైక్షన్ చేయాలనుకున్నా. వైజాగ్‌లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న రవికుమార్ 'ఆ ఇంట్లో' సినిమా చూసి, నాతో సినిమా చేయాలనుకున్నారు. మూడు నెలల క్రితం ఆయన కలిశారు. ఆ తర్వాత ఈ చిత్రానికి శ్రీకారం చుట్టాం'' అని నటుడు, దర్శకుడు చిన్నా చెప్పారు. విహారిక సమర్పణలో వికాస్ ప్రొడక్షన్స్ పతాకంపై తొలి ప్రయత్నంగా చిన్నా దర్శకత్వంలో ఆదరి రవికుమార్ ఓ చిత్రం నిర్మించనున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో అతిథిగా పాల్గొన్న హీరో శ్రీకాంత్ రియల్ ఎస్టేట్ బ్రోచర్‌నూ, నటుడు శివారెడ్డి సినిమా పోస్టర్‌నూ ఆవిష్కరించారు. ''ఇది హారర్ మూవీ కాదు. ఫక్తు కామెడీ సినిమా'' అని చిన్నా తెలిపారు. ''మంచి కథతో ఈ చిత్రం చేస్తున్నాం'' అని నిర్మాత అన్నారు. 'మధురా నగరిలో'తో చిన్నా, తానూ కెరీర్ ఆరంభించామనీ, చిన్నాకి మంచి ప్లానింగ్ ఉందని శ్రీకాంత్ చెప్పారు. మంచి పాయింట్‌తో సినిమాతో తీయబోతున్నారని శివారెడ్డి అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బీవీ నాయుడు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









