ఆఫీసులో వారానికోసారి 'స్టీమ్ బాత్'

- July 19, 2018 , by Maagulf
ఆఫీసులో వారానికోసారి 'స్టీమ్ బాత్'

ఉద్యోగం అనగానే చాలా మంది తన పై అధికారి వల్ల పని ఒత్తిడి పెరుగుతుందని, ఆఫీస్ టైం అయిపోయిన తరువాత కూడా గంటల కొద్దీ ఆఫీస్‌లోనే కూర్చోమనడం.. ఇలా బాస్ వల్ల వెంటాడే సమస్యలు చాలానే చెబుతారు ఉద్యోగులు.. 

కానీ ఆఫీసులో బాసుతో కలిసి నగ్నంగా ఓ రూమ్‌లో గంటల కొద్దీ గడపడం.. బాస్‌తో కలసి జలకాలు చేయటం వంటివి ఎప్పుడైనా విన్నారా.. ఇలాంటివి ఇక్కడ మామూలే అంటున్నారు ఉద్యోగులు. 

జర్మనీ, హోలాండ్‌, ఫిన్లాండ్‌ వంటి దేశాల్లో ఉద్యోగులు వాళ్ల కొలీగ్స్‌తో కలిసి స్టీమ్ బాత్ చేయటం చాలా సాధారణ విషయం. ఫిన్లాండ్‌లో అయితే వాళ్ల బాస్‌తో కలసి నగ్నంగా స్టీమ్ బాత్ చేస్తుంటారు.

బాస్‌తో కలిసి మహిళ ఉద్యోగులు నగ్నంగా మారి ఆఫీసులోనే సరాదాగా కబుర్లు చెప్పుకుంటారట. స్టీమ్ బాత్ రూమ్‌లో అయితే బాసు, ఎంప్లాయి అనే బేధాలు ఉండవు.. ఇగోలు కూడా ఉండవు. చాలా ఫ్రీగా మనసు విప్పి మాట్లాడుకోవడం.. ఒకరిని ఒకరు దగ్గర చేసుకోవటం మాత్రమే ఉంటాయంటున్నారు ఇక్కడ జాబ్ హోల్డర్స్.

55 లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో ప్రతి ఇద్దరికీ ఒక స్టీమ్ బాత్ రూమ్ ఉంటుంది. దీన్ని ఇక్కడ 'సానా' అని పిలుస్తుంటారు. చాలా కంపెనీలు తమ ఆఫీసుల్లోనే వీటిని ఏర్పాటు చేసుకున్నాయి.

ఫిన్లాండ్‌లో చలి ఎక్కువగా ఉంటుంది. దీంతో చాలామంది ఈ స్టీమ్ బాత్‌ని ఇష్టపడుతుంటారు.  వారంలో ఐదు రోజులు ఆఫీసులో కష్టపడి వర్క్ చేసి.. ఆ కష్టాన్ని మరచిపోయేలా 'సానా'లో గోరు వెచ్చటి నీటితో స్నానం చేస్తారట.. దీంతో వారు కొత్త ఉత్సాహంతో పని చేయడానికి దోహదం చేస్తుందని ఉద్యోగులు అంటున్నారు. 

అయితే వీటిలోకి వెళ్లాలంటే కచ్చితంగా బట్టలు విప్పాల్సిందేనట. ఒంటిమీద నూలుపోగు కూడా ఉండకూడదట. 

గత కొంతకాలంగా స్టీమ్ బాత్ రూమ్‌లో కబుర్లాడుకునే సంస్కృతి తగ్గుతోంది. దీనికి కారణం.. ఫిన్లాండ్‌లోని కంపెనీలన్నీ గ్లోబల్‌ కంపెనీలుగా మారుతుండటం, భిన్న సంస్కృతులకు చెందినవాళ్లు వీటిలో పనిచేస్తుండటం, పని ఒత్తిడి పెరుగుతుండటం వల్లే ఇలాంటి రూమ్‌లో టైం గడపడటానికి అంతగా ఆసక్తి చూపడం లేదట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com