గుడ్డు ముట్టీల మాంసం

గుడ్డు ముట్టీల మాంసం

కావలసినవి: మటన్‌ కైమా 500 గ్రా., వేయించిన శనగపప్పు 100 గ్రా., అల్లం 10 గ్రా., వెల్లుల్లి 10 గ్రా., పచ్చిమిర్చి 15 గ్రా., కారం 10 గ్రా., దాసించెక్క చిన్న ముక్క, లవంగాలు ఐదారు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర ఒక కట్ట, పుదీన సగం కట్ట, మంచినూనె 150 గ్రా.
ఎలా చేయాలి
కైమాను శుభ్రంగా కడగాలి. శనగపప్పు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కారం, దాల్చిన చెక్క, లవంగాలు, పసుపు, ఉల్లి, కొత్తిమీర, పుదీన అన్నిటినీ కైమాలో కలిపి గ్రైండర్‌లో వేసి మెత్తగా చేయండి. తరువాత తడిచేత్తో దానిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టండి. కడాయిలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కల్ని వేగించిన తర్వాత కైమా ముద్దలను వేసి మూతపెట్టి సన్నని సెగమీద పూర్తిగా ఉడికే దాకా ఉంచండి. ఆ తరువాత పెనం మీద నెయ్యిగాని, నూనెగాని వేసి గుడ్డు కొట్టి కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా వేయాలి. దానిమీద కైమాబాల్‌పెట్టి అదమండి రెండోవైపు కూడా కాల్చాక ఉల్లిపాయ ముక్కలతో కలిపి వేడివేడిగా తినండి.

Back to Top